Asianet News TeluguAsianet News Telugu

ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపీడీలు.. సహకరించిన కానిస్టేబుల్.. అరెస్ట్..

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని  గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో పాటు దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

police arrested thief gang in guntur - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 2:40 PM IST

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని  గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో పాటు దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వారి నుండి రూ. 2,50,000 విలువ చేసే ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి మాట్లాడారు. 

వెంగళాయపాలెంలోని శ్రీశైలం కాలనీలో  నివాసం ఉంటున్న పువ్వాడ విజయలక్ష్మీ ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో.. చింతలపూడి సాగర్ బాబు, పాదర్తి సురేష్, అచ్చి చిన్న సైదారావు అనే వ్యక్తులు ఆమె మెడలోని చైన్ని లాక్కొని పారిపోయారు. 

మొత్తం నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వీరంతా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఆభరణాలు చోరీ చేస్తున్నారని, ఇలాంటి పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios