టీజర్ కీచక బుద్ధి.. ఇద్దరు ఐదవ తరగతి బాలికలతో..
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు వస్తున్నా అమ్మాయిలపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ ఉపాధ్యాయుడు తన కీచక బుద్దిని బయట పెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడి ఆట కట్టించారు.

ఏలూరు పట్టణంలో బావిశెట్టివారిపేట మున్సిపల్ స్కూల్ లో కూరపాటి కిషోర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలతో కిషోర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
వేర్వేరు సమయాల్లో కిషోర్ ఆ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆ బాలికలిద్దరూ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికల తల్లిదండ్రులు స్థానికులతో కలసి స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.
రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్
పోలీసులు రావడంతో స్థానికులు ఆందోళన విరమించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై ఫోక్సో కేసులు నమోదు చేశారు. అభం శుభం తెలియని చిన్నారులపై ఇలాంటి కీచకులు లైంగిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత