విజయవాడ: విజయవాడ పట్టణంలోని రామవరప్పాడు చెక్‌పోస్టు  వద్ద ఓ వ్యక్తి  అతి వేగంగా కారును నడపడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది.

విజయవాడ రామవరప్పాడు చెక్ పోస్టు వద్ద ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్  విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం నాడు ఉదయం సన్నీ అనే యువకుడు క్వాలిస్ వాహనాన్ని అతి వేగంగా నడుపుకొంటూ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు.

దీంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన  కానిస్టేబుల్ ను అక్కడే ఉన్న ఓ వైద్యుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కు  ప్రాథమిక చికిత్స నిర్వహించారు.  వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ ను తన వాహనంతో ఢీకొట్టిన సన్ని అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  సన్నిపై కేసు నమోదు చేయనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.