యజమానికే మస్కా కొట్టి 10 కిలోల నగలు చోరీచేసిన గుమస్తా అరెస్ట్.. !!

బంగారు నగల దుకాణంలో పనిచేస్తూ 10 కిలోల బంగారు ఆభరణాలతో పరారైన కేసులో నిందితుడు బొబ్బిలి వెంకట హర్షను విజయవాడ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

police arrested gold theft gumasta in vijayawada - bsb

బంగారు నగల దుకాణంలో పనిచేస్తూ 10 కిలోల బంగారు ఆభరణాలతో పరారైన కేసులో నిందితుడు బొబ్బిలి వెంకట హర్షను విజయవాడ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి వెంకట హర్ష.. విజయవాడ గవర్నర్ పేటలోని రాహుల్ జ్యూయలర్స్ లో మహావీర్ జైన్ దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.  గవర్నర్పేట జైహింద్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మహావీర్ జైన్ అనే వ్యక్తి రాహుల్ జ్యువలరీ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గర రవితేజ, హర్ష అని ఇద్దరూ గుమాస్తాలుగా పని చేస్తున్నారు. 

అదే సముదాయంలోని ఐదవ అంతస్తులో యజమాని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా కారణంగా మహావీర్ జైన్ ఆభరణాలను ఇంట్లోనే ఉంచి కొనుగోలుదారులు వచ్చినప్పుడు వాటిని షాప్ కి తెప్పిస్తాడు. ఆ తరువాత తిరిగి ఇంటికి పంపుతున్నాడు. మంగళవారం ఉదయం ఆభరణాలు తీసుకొచ్చేందుకు ఇద్దరు గుమస్తాలను యజమాని ఐదవ అంతస్తులోని తన ఇంటికి పంపాడు. అతని భార్య, కుమారుడు రెండు బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను వారిద్దరికీ ఇచ్చి పంపారు. అనంతరం 11 గంటల తర్వాత ఆ ఆభరణాలను తిరిగి ఇద్దరు గుమాస్తాలు యజమాని ఇంటికి వెళ్లి ఇచ్చి వచ్చారు.

యజమానికే మస్కా కొట్టిన గుమస్తా.. 10 కిలోల బంగారంతో ఎస్కేప్.. !...

కాగా మహావీర్ కోవిడ్ బారిన పడిన సోదరుడిని చూడడానికి 11.30 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమయంలో గుమస్తా హర్ష పన్నెండున్నర గంటల సమయంలో యజమాని ఇంటికి వెళ్లి రెండు బ్లాగుల్లో ఉన్న ఆభరణాలను తీసుకుని దుకాణానికి వెళ్లకుండా వాటితో ఉడాయించాడు. ఆస్పత్రికి వెళ్లిన మహావీర్ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం యధావిధిగా దుకాణం తెరిచి ఆభరణాల కోసం ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కంగుతిన్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నగలతో పాటు ఖాళీ చెక్కును కూడా షాపులో నుంచి తీసుకెళ్లాడు. ఆ చెక్కుమీద సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 4.6 లక్షలు తన ఖాతాలోకి మార్చుకున్నాడు. పోరంకిలోని బ్యాంకులో డ్రా చేసుకున్నాడు. చోరీ చేసిన సొత్తుతో పాటు, కుటుంబాన్ని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేసిన డీసీపీ విక్రాంత్ పాటిల్, క్రైం ఏడీసీపీ ఎం. సుబాష్ చంద్రబోస్, సీసీఎస్ ఏసీపీ కొల్లి శ్రీనివాసరావు, గవర్నర్ పేట సీఐ ఎం.వి.ఎస్.నాగరాజులను సీపీ అభినందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios