Asianet News TeluguAsianet News Telugu

జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అరెస్ట్, కారు సీజ్

 అనంతపురం జిల్లా తాడిపత్రిలో మా.జీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో దాడితో పాటు ఆ తర్వాత చోటు చేసుకొన్న ఘటనలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులను బుధవారం నాడు  అరెస్ట్ చేశారు.

Police arrested five for attacking on former MLA JC prabhakar Reddy house in Tadipatri lns
Author
Tadipatri, First Published Dec 30, 2020, 12:13 PM IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మా.జీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో దాడితో పాటు ఆ తర్వాత చోటు చేసుకొన్న ఘటనలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులను బుధవారం నాడు  అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై  ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి దిగారు. 

ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది.ఈ దాడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.ఈ ఘటనకు సంబంధించి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రమణ, ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, రవి, బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:నన్ను భయపెట్టాలని చూస్తే ఊరుకొంటానా: కేతిరెడ్డి పెద్దారెడ్డి

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.జేసీ వర్గీయులను కూడ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే  జేసీ ప్రభాకర్ రెడ్డిపై వేగంగా దూసుకొచ్చిన కారును పోలీసులు బుధవారం నాడు సీజ్ చేశారు.

తాడిపత్రిలో వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్  అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో  ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios