కర్నూల్:  పుష్కరఘాట్లలో 
సామూహిక స్నానాలు చేసిన  బీజేపీ, వీహెచ్‌పీ,  భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తుంగభధ్ర పుష్కరాలను పురస్కరించుకొని సంకల్ బాగ్ పుష్కరఘాట్ వద్ద  సామూహిక  పుష్కర స్నానాలకు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పిలుపునిచ్చారు.

అయితే సామూహిక స్నానాలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. దీంతో సంకల్ బాగ్ పుష్కరఘాట్ వద్ద పోలీసులతో  సంఘ్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.

పుష్కర స్నానాలకు అనుమతివ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సంఘ్ కార్యకర్తలు ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పుష్కర ఘాట్లలో స్నానాలకు అనుమతి ఇవ్వలేదు.

నది నీటిని నెత్తిపై చల్లుకొనేందుకు మాత్రమే అనుమతిచ్చారు. దీంతో సంఘ్ కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.పోలీసుల కళ్లుగప్పి  సంఘ్ కార్యకర్తలు  పుష్కరఘాట్ లో సామూహిక స్నానాలు  చేశారు. సామూహిక స్నానాలు చేసిన  వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పుష్కర స్నానాలకు అనుమతివ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సంఘ్ కార్యకర్తలు ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పుష్కర ఘాట్లలో స్నానాలకు అనుమతి ఇవ్వలేదు.

నది నీటిని నెత్తిపై చల్లుకొనేందుకు మాత్రమే అనుమతిచ్చారు. దీంతో సంఘ్ కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.