పాతికేళ్లు దాటని కొడుకు.. చోరీలకు అలవాటు పడ్డాడు. బుద్ధి మార్చుకోమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా...మారలేదు. దీంతో... తల్లే స్వయంగా కొడుకుని పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తనకల్లు మండలం, నందిగానిపల్లెకు చెందిన సూరిబాబు కుమారుడు సాయి నితిన్(22). సూరిబాబు అనారోగ్యంతో చనిపోవడంతో... సాయి నితిన్ తల్లి మరో వ్యక్తిని పెళ్లాడింది. వాళ్ల సంరక్షణలోనే నితిన్ పెరిగాడు. చిన్ననాటి నుంచే వ్యసనాలకు అలవాటుపడ్డ నితిన్ ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 

ఎంతగా ప్రయత్నించినా కొడుకు మారకపోవడంతో స్వయంగా తల్లే అతన్ని పోలీసులకు అప్పగించింది. అలా బాలనేరస్తుడిగా గతంలో అనంతపురం జువైనల్‌ హోమ్‌కు చేరి, అక్కడినుంచి కూడా తప్పించుకున్నాడు. ఇలా చోరీలకు అలవాటుపడ్డ ఆ యువకుడు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సుమారు 42 ఇళ్లలో దొంగతనాలు చేశాడు.

కాగా... తాజాగా అతనిని కన్నతల్లే పోలీసులకు అప్పగించింది. పగటిపూట దొంగతనాలు చేయడం ఇతని స్పెషల్. తాళం వేసి ఉన్నన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. పోలీసులకు దొరకకుండా చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు. స్వగ్రామంలో సీసీకెమేరాలను తానే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారా పోలీసుల సమాచారం తెలుసుకొని పరారయ్యేవాడు. కాగా... అతని తీరుతో విసిగిపోయిన తల్లి... పోలీసులకు అప్పగించింది.