Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరిట వేధింపులు.. ఆర్టీసీ ఉద్యోగి అరెస్ట్

ఈ ఏడాది ప్రారంబంలో డిపోలో తాగిన మైకంలో సూపర్ వైజర్ తో గొడవపడ్డాడు. దీంతోపాటు.. తరచూ విధులకు గైర్హజరు అయ్యేవాడు.

Police Arrest The RTC Employee Who Molested Woman in Vijayawada
Author
Hyderabad, First Published Nov 27, 2020, 7:58 AM IST

ప్రేమ, పెళ్లి అంటూ తోటి ఉద్యోగిని ఓ ఆర్టీసీ ఉద్యోగి వేధింపులకు గురిచేశాడు. దాని పుణ్యమా అతను జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అంతేకాదు ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ  సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన అజయ్ అనే వ్యక్తి  గవర్నర్ పేట డిపోలో శ్రామిక్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంబంలో డిపోలో తాగిన మైకంలో సూపర్ వైజర్ తో గొడవపడ్డాడు. దీంతోపాటు.. తరచూ విధులకు గైర్హజరు అయ్యేవాడు. దీంతో అతనిపై క్రమిశిక్షణ చర్యల కింద విధుల నుంచి తొలగించారు.

మళ్లీ ఉన్నతాధికారులను బ్రతిమిలాడి విధుల్లోకి చేరాడు. ఒకసారి విధుల్లో నుంచి తొలగించినా.. అతనిలో మార్పు రాలేదు. పైగా ప్రేమ, పెళ్లి అంటూ తోటి మహిళా ఉద్యోగినిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదు. పైగా ఫోన్ చేసి మరీ ఆమెను వేధించేవాడు. దీంతో.. ఆమె విసిగిపోయింది.

ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా.. ఇంటికి వెళ్లి మరీ బెదిరించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానంటూ హెచ్చరించడం మొదలుపెట్టాడు. దీంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు  చేశారు. మరోవైపు ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియడంతో.. విచారణ చేసి.. అతనిని విధుల నుంచి తొలగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios