కొడుకు తప్పు చేస్తే.. మందలించి బుద్ధి చెప్పాల్సిందిపోయి... అతనికే వంత పాడారు. తమ కుమారుడు ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడని తెలిసినా... అందులో తప్పు ఏముందని ప్రవర్తించడం విశేషం. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరిట ఆమెకు దగ్గరయ్యాడు.  ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి.. స్పృహలేని సమయంలో ఆమె అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత పలు మార్లు బెదిరించి ఆమె వద్ద నుంచి దాదాపు రూ.50లక్షలు వసూలు చేశాడు.

ఇంకా ఇవ్వాలని బెదిరించడంతో... తన దగ్గరలేవని ఆమె చెప్పింది. తన దగ్గర ఇంక డబ్బులు లేవని.. అప్పుల్లో కూరుకుపోతానని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో... అతని తల్లిదండ్రులను ఆమె బ్రతిమిలాడింది. అయితే... వాళ్లు కూడా ఆమె బాధను పట్టించుకోకపోవడం గమనార్హం. అక్కడితో ఆగకుండా...తమ కొడుకు చెప్పింది కరక్టేనంటూ వాధించడం గమనార్హం.

దీంతో బాధితురాలు చిట్టచివరగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. విచారణలో పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని విస్తుపోయారు.  యువతి ఇచ్చిన డబ్బులను అతనితోపాటు తల్లిదండ్రులు కూడా పంచుకునేవారని తెలిసి పోలీసులు విస్తుపోయారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.