మరోసారి చింతమనేని అరెస్ట్...ఇది మరో కేసు
కొద్ది రోజుల క్రితం చింతమనేనని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకి ముందు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందని ఇంటికి రాగా.. పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఆయన బెయిల్ కోసం అప్పీలు చేసుకోగా... కోర్టు నిరాకరించింది.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. 2018లో పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టు మట్టి తరలింపు వ్యవహారంపై గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మేడికొండ వెంకటసాంబ కృష్ణారావు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
చింతమనేని ఫిర్యాదిదారుడిని తన ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనపై పెదవేగి పోలీస్ స్టేషన్‌లో 2018లోనే క్రైం సంఖ్య 248/2018గా నమోదు అయింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది.
సెప్టెంబరు 11న అరెస్టయి ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చింతమనేనిపై గతంలో ఉన్న పలు కేసుల్లో పీటీ వారెంటుపై పోలీసులు అరెస్టులు చూపిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం పైకేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై చింతమనేనిని అరెస్ట్ చూపించారు. ఎక్సైజ్ కోర్టు మేజిస్ర్టేట్ బంగ్లాలో హాజరుపరిచారు. ఈ నెల 9 వరకు రిమాండ్ విధించారు.
ఇదిలా ఉండగా... కొద్ది రోజుల క్రితం చింతమనేనని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకి ముందు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందని ఇంటికి రాగా.. పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఆయన బెయిల్ కోసం అప్పీలు చేసుకోగా... కోర్టు నిరాకరించింది.
కాగా..తన కుటుంబసభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని.. ప్రస్తుతం తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పారు. సోదాల పేరుతో పోలీసులు ఈ రోజు ఉదయం తన ఇల్లు ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇళ్లంతా గందరగోళం సృష్టించి... భయబ్రాంతులకు గురిచేస్తే... జిల్లా అంతా అణిగిమణికి ఉంటుందనుకున్నారని.. తనను రెచ్చగొట్టారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు.
తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్సా రుజువు చేస్తే.. తన తండ్రి ఆస్తి, తన ఆస్తి పేదలకు దానం చేస్తానని, లేకపోతే మంత్రి పదవికి బొత్సా రాజీనామా చేస్తారా? అంటూ చింతమనేని సవాల్ విసిరారు.