Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మరో అద్భుతం... కీలక నిర్మాణం పూర్తవడంతో ప్రత్యేక పూజలు (వీడియో)

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది.  153.50 మీటర్లు పొడవు, 53.320మీటర్ల ఎత్తు, 8.50 మీటర్లు వెడల్పుతో చేపట్టిన గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తయింది. 

Polavaram Project GAP 3 Work Completed
Author
Polavaram, First Published Sep 9, 2021, 4:47 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ పోలవరం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన అనేక పనులు పూర్తయ్యాయి. అయితే తాజాగా మరో కీలక   నిర్మాణపని కూడా పూర్తయినట్లు మేఘా ఇంజనీరింగ్ సంస్ద ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్3 నిర్మాణం పూర్తయినట్లు మేఘా సంస్థ తెలిపింది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్-3 కాంక్రీట్ పనులను పూర్తిచేసినట్లు పోలవరం ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు,ఎస్ఈ నరసింహమూర్తి వెల్లడించారు. 

వీడియో

153.50 మీటర్లు పొడవు, 53.320మీటర్ల ఎత్తు, 8.50 మీటర్లు వెడల్పుతో గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం జరిగినట్లు అధికారులు తెలిపారు. స్పిల్ వే నుండి ఈసిఆర్ఎఫ్ డ్యాంకు అనుసంధానం చేయడానికి గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం కోసం దాదాపు 23వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించినట్లు తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్ లో 3 ఈసిఆర్ఎఫ్ డ్యాంలలో గ్యాప్-3 ఒకటని... అయితే గ్యాప్-1, గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ లు రాక్ ఫిల్ ఢ్యాంలు కాగా గ్యాప్-3 మాత్రమే కాంక్రీట్ డ్యాం అని అదికారులు వెల్లడించారు.

READ MORE  శాస్త్రోక్తంగా పూజలతో... పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం (వీడియో)

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోంది. ఓవైపు వరదలు, మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులున్నా లక్ష్యం దిశగా సాగుతోంది. 

గ్యాప్-3 నిర్మాణ పూర్తయిన సందర్భంగా జరిపిన పూజా కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈలు పాండురంగా రావు, మల్లిఖార్జున రావు, ఆదిరెడ్డి, డిఈఈ ఎమ్.కె.డి.వి ప్రసాద్, ఎఈఈ శ్రీధర్, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎంలు ఎం.ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, ఎజిఎంలు కె.రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios