Asianet News TeluguAsianet News Telugu

శాస్త్రోక్తంగా పూజలతో... పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మరింత వేగం పెరిగింది. తాజాగా దిగువ కాఫర్ ఢ్యాం ఢయా ప్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నిర్మాణ సంస్థ.

Polavaram Project Cofferdam works Speed Up... Diaphragm Wall Works begins akp
Author
Polavaram, First Published Aug 9, 2021, 12:28 PM IST

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు మరింత వేగాన్ని అందుకున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ భారీ ప్రాజెక్ట్ ను పూర్తిచేసేలా చురుకుగా పనులు సాగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టులో కీలకమైన దిగువ కాఫర్ ఢ్యాం ఢయా ప్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నిర్మాణ సంస్థ. నేడు(సోమవారం) మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ , జలవనరుల శాఖ డిఈఈ ఎం కె డి వి ప్రసాద్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఢయా ప్రం వాల్ పనులను ప్రారంభించారు. 

96 మీటర్ల పొడవు,10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టనుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. దిగువ కాఫర్ ఢ్యాం పొడవు 1613మీటర్లు,30.5మీటర్ల ఎత్తు వుండనుంది. దిగువ కాఫర్ ఢ్యాంలో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ కాఫర్ ఢ్యాం దగ్గర నదిలో గ్యాప్ లను పూడ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 

వీడియో

దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాయి జలవనరుల శాఖ,  మేఘా ఇంజనీరింగ్ సంస్థ.  ఎగువ, దిగువ కాఫర్ ఢ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు.  ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసిఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

read more  రాయలసీమపై నివేదికను సమర్పించలేం.. 3 వారాలు గడువు ఇవ్వండి: ఎన్జీటీకి కేఆర్ఎంబీ లేఖ

గత నెల జూలైలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం హెలిపాడ్‌ వద్దనున్న వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ నుంచి ఇటీవలే పూర్తైన స్పిల్‌వే మీదకు చేరుకున్న సీఎం పనుల్ని పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల్ని సీఎంకు వివరించారు అధికారులు.

ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తిచేశామని... 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే జర్మనీ నుంచి సిలిండర్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు.  అలాగే దిగువ కాఫర్‌డ్యాం పనుల పరిస్థితిని కూడా సీఎంకు వివరించారు అధికారులు. పనులన్ని వేగంగా పూర్తిచేసి అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 
 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios