రాయలసీమపై నివేదికను సమర్పించలేం.. 3 వారాలు గడువు ఇవ్వండి: ఎన్జీటీకి కేఆర్ఎంబీ లేఖ
చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు సంబంధించిన నివేదికను సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువు కోరారు బోర్డ్ మెంబర్ సెక్రటరీ రాయ్ పూరే
చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు సంబంధించిన నివేదికను సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువు కోరారు బోర్డ్ మెంబర్ సెక్రటరీ రాయ్ పూరే. గత వారమే ప్రాజెక్ట్ పనులను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ ఆదేశాలిచ్చినప్పటికీ ఏపీ అభ్యంతరాలతో కేఆర్ఎంబీ బృందం పర్యటన ఆగిపోయింది.
ALso Read:మరో రోజు సమావేశం పెట్టండి: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
మరోవైపు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం లేఖ రాసింది. రేపటి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. మరో తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిన్న కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని కోరింది. నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. సాగర్ నీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు నుంచి తరలింపు ఆపాలని కోరింది. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకోంటోందని ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని ఫిర్యాదు చేసింది.