ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో మరో అపశృతి చోటుచేసుకుంది. ఉదయం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తున్న బస్సు మట్టిలో కూరుకుపోగా.. చిన్నపాటి ప్రమాదం తప్పగా.. తాజాగా మరో ప్రమాదం జరిగింది. మంత్రి పుల్లారావు కాన్వాయిలోని ఓ కారు బోల్తా పడింది. కాగా.. స్వల్పగాయాలతో నేతలు బయటపడ్డారు.

పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంత్రి పుల్లారావు ఘటనాస్థిలి పరిశీలించారు. సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదం గురించి పుల్లారావును అడిగితెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
 
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు.