Asianet News TeluguAsianet News Telugu

పోలవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పోలవరం... ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు విననివారు వుండరంటే అతిశయోక్తి కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టే పోలవరం. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో  ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టే కాదు పోలవరం అసెంబ్లీ కూడా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గిరిజన, ఆదివాసీలు ఎక్కువగా వుండే ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేసారు. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ ఏపీ రాజకీయాలు సాగుతుంటే మరి పోలవరం పాలిటిక్స్ ఎలా వున్నాయి? అక్కడి ఓటర్ల మద్దతు ఏ పార్టీకి వుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Polavaram assembly elections result 2024 AKP
Author
First Published Mar 20, 2024, 6:41 PM IST

పోలవరం రాజకీయాలు :  

పోలవరం రాజకీయాలను చాలాకాలంగా తెల్లం బాలరాజు శాసిస్తున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి మొదటిసారి పోటీచేసిన తెల్లం బాలరాజు విజయకేతనం ఎగరేసాడు. మళ్లీ 2009 లో కూడా కాంగ్రెస్ నుండి పోటీచేసిన ఆయన గెలుపొందాడు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కొత్తపార్టీ పెట్టగా బాలరాజు ఆయనవెంటే నడిచాడు. దీంతో 2012 పోలవరంలో ఉపఎన్నిక జరగ్గా మళ్ళీ బాలరాజే గెలిచాడు. కానీ 2014లో పోటీచేసిన బాలరాజు ఓడిపోయాడు... 2019 లో విజయం సాధించాడు. ఇలా ఇప్పటివరకు పోలవరం నుండి నాలుగుసార్లు విజయం సాధించారు బాలరాజు. 

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలరాజు అనూహ్యంగా పోటీనుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో భార్య రాజ్యలక్ష్మి బరిలోకి దిగారు. దీంతో పోలవరం పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. 

పోలవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. బుట్టాయిగూడెం
2. జిలుగుమిల్లి
3. కొయ్యలగూడెం
4. టి. నరసాపురం
5. కుక్కునూరు
6. వేలేరుపాడు
7. పోలవరం 

పోలవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,45,535
పురుషులు -   1,19,769
మహిళలు ‌-   1,25,751

పోలవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :
 
సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మిని  పోలవరం బరిలోకి దింపుతోంది వైసిపి.  ఈ ప్రయోగం వైసిపి వ్యూహాత్మకంగానే చేసినా అభ్యర్థి మార్పుతో పోలవరం పోరు ఆసక్తికరంగా మారింది. 

టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థి :

టిడిపి, జనసేన, బిజెపి పొత్తు నేపథ్యంలో పోలవరం సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటును జనసేన, బిజెపిలు ఆశిస్తున్నాయి. 

పోలవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పోలవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,12,466 (86 శాతం) 

వైసిపి - తెల్లం బాలరాజు - 1,10,523 ఓట్లు - 42,070 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - బోరగం శ్రీనివాసరావు  - 68,453 ఓట్లు - ఓటమి

జనసేన పార్టీ - చుర్రి బాలరాజు  - 13,378 ఓట్లు  

పోలవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,64,079 (85 శాతం)

టిడిపి - మొడియం శ్రీనివాసరావు - 83,767 (51 శాతం) ‌- 15,720 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - తెల్లం బాలరాజు - 68,047 (41 శాతం) - ఓటమి 

Follow Us:
Download App:
  • android
  • ios