ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా.’ అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

గత ఎన్నికల సమయంలో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో బాగున్నారు. ఎన్డీయే మిత్రపక్షంలో టీడీపీకూడా ఉంది. కానీ ఎప్పుడైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చిన్నచూపు చూడటం మొదలుపెట్టిందో.. చంద్రబాబు, మోదీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. టీడీపీ.. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది కూడా. 

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మోదీ మళ్ల ప్రధాని కాకూడదంటూ.. చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టారు. ఈ క్రమంలో చంద్రబాబుకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం కొందరిని షాకింగ్ కి గురిచేసింది.