ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించాలన్న చంద్రబాబు, మమతా బెనర్జీ సర్కారుల నిర్ణయంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీబీఐని ఎందుకు అడ్డుకుంటున్నారు, అంత భయపడేంత తప్పు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐని నిరాకరించారు.. రేపు మరికొన్ని సంస్థలను రానీయమంటారు.
సైన్యం, పోలీసులు, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, కాగ్ ఇలా ప్రతిదీ వారి దృష్టిలో తప్పుడు సంస్థేనా అంటూ నిలదీశారు. వ్యవస్థలన్నీ తప్పు వారు మాత్రమే సచ్ఛీలురా అంటూ మోదీ ప్రశ్నించారు. తాను గుజరాత్ సీఎంగా ఉండగా, తొమ్మిది గంటలపాటు సిట్ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నానని మోదీ గుర్తు చేశారు.
అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బీజేపీ యేతర కూటమికి ఎవరు నాయకుడుగా ఉంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కూటమికి నాయకులుగా ఉండేది బెంగాల్ దీదీయా , ఆంధ్రప్రదేశ్ బాబు , యూపీ బెహన్‌జీయా అంటూ సెటైర్లు వేశారు.
