ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం జగన్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు.. జగన్ బర్త్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, సినీ ప్రముఖులు నాగార్జున, విశాల్, బండ్ల గణేష్.. తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు.. ‘‘జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

పవన్ కల్యాణ్.. జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నోట్‌ను జనసేన పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక, నాగార్జున జగన్‌కు బర్త్‌ డే విషెస్ చెబుతూ.. ‘‘ప్రియమైన వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఆశీర్వదించబడాలి!’’ అని ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్నాథుడు, వేంకటేశ్వరుడు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం మీపై వారి ఆశీస్సులు ఉంచాలని, మీ చైతన్యవంతమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతి, శ్రేయస్సు పథంలో నడిపించడానికి మీకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను’’ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరుమల దేవస్థానం వేదపండితులు జగన్ కు వేదాశీర్వచనం అందించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఆ తర్వాత క్రైస్తవ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి జగన్ ను ఆశీర్వదించారు. ఇక, మంత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో సీఎం జగన్ కేక్ కట్ చేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు ఆర్కే రోజా, తానేటి వ‌నిత‌, విడ‌ద‌ల ర‌జిని, జోగి ర‌మేష్‌, ఎంపీ బాల‌శౌరి, సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. వీరంతా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.