ఒకవైపు వెంకయ్య మాట్లాడుతుండగానే ఇంకోవైపు యువత పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం గమనార్హం.
భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో టిడిపికి వ్యతిరేకంగా ప్ల కార్డుల ప్రదర్శన. విచిత్రంగా లేదు. అంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయడుపై పార్టీలో ఎంత కోపముందో అర్బాధమవుతోంది. ఎందుకంటే, యువత చేసిన నినాదాలు వెంకయ్య మాట్లాడుతున్నపుడు పెద్ద ఎత్తున వినిపించారు కాబట్టి.
విజయవాడలోని సిద్దార్ధ కళాశాల మైదానంలో ఈరోజు జరిగిన బహిరంగసభలో వెంకయ్య మాట్లాడుతున్నపుడు పలువురు యువత చేసిన హడావుడితో ఈ విషయం స్పష్టమైంది. ఒకవైపు వెంకయ్య మాట్లాడుతుండగానే ఇంకోవైపు యువత పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం గమనార్హం. పైగా వెంకయ్యనాయుడు ఉన్నంత వరకూ భాజపా ఎదగదంటూ తమ అభిప్రాయాలను బాహాటంగా చెప్పటం గమనార్హం.
‘టిడిపిని వదిలేయండి భాజపాను బ్రతికించండి’ అంటూ నినాదాలు రాసున్న ప్ల కార్డులను ప్రదర్శిస్తూ యువత పెద్ద ఎత్తున గందరగోళం చేసారు. వారు నినాదాలు చేస్తున్నపుడు వెంకయ్యలో అసహనం స్పష్టంగా కనబడింది. రాష్ట్ర భాజపాలో రెండు వర్గాలున్న విషయం వాస్తవం. వెంకయ్య వర్గమేమో టిడిపితో పొత్తుండాల్సిందే అని పట్టుబడుతోంది. వ్యతిరేక వర్గమేమో ఇప్పటికిప్పుడు టిడిపితో పొత్తు విడిపోవాలంటూ డిమాండ్ చేస్తోంది.
అదే మైండ్ సెట్ జిల్లాలోని వర్గాలకు కూడా పాకుతుంది కదా? ఇపుడు జరిగింది అదే. వెంకయ్య మాట్లాడుతున్నపుడు పలువురు యువత టిడిపికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించటం చర్చనీయాంశమైంది. వారి ప్లకార్డుల ప్రదర్శన అమిత్ షా ప్రసంగిస్తున్నపుడు కూడా కొనసాగింది.
