హైదరాబాద్: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను అమాంతం పెంచేసింది. దసరా సంక్రాంతి వంటి పండుగలప్పుడు రైల్వే స్టేషన్లకు తమవారికి వీడ్కోలు పలకటానికి, వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు వస్తుంటారు. ఇలాంటివారివల్ల స్టేషన్ బాగా రద్దీగా మారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది. 

నేటి నుంచి అక్టోబర్ 10వరకు ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా 10 రూపాయలుండే ప్లాట్ ఫామ్ టికెట్ రేటును 30 రూపాయలకు పెంచారు. విజయవాడ, రాజముండ్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఈ పెంచిన చార్జీలు అమలుచేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇలా ఈ రద్దీ ని నియంత్రించేందుకు రైల్వేలు ఇలా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచుతువుంటుంది. ఇలా పెంచడం వల్ల రద్దీ తగ్గడమే కాకుండా, ఆదాయం కూడా బాగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా ఒక వారం రోజులపాటు పెంచడం సహజమే. కానీ ఈ సరి ఏకంగా 3రెట్లు పెంచేశారు. గతంలో 10రూపాయల టికెట్ ను 20 రూపాయలుగా చేసేవారు. కానీ ఈ సారి ఏకంగా 30 రూపాయలు చేసారు.