Asianet News TeluguAsianet News Telugu

తన చెల్లితో భర్త రెండో పెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..

తన చెల్లిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య భర్తను హత్యచేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. ఆ భర్త మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభా కొడుకు ఎస్‌కే ఖాదర్‌బాషా. 

petrol attack on machilipatnam market yard chairman son machilipatnam - bsb
Author
Hyderabad, First Published Oct 31, 2020, 12:38 PM IST

తన చెల్లిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య భర్తను హత్యచేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. ఆ భర్త మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభా కొడుకు ఎస్‌కే ఖాదర్‌బాషా. 

హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని హుటాహుటిన విజయవాడకు తరలించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదు చేశారు. 
అచ్చేభాకు ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు కొంతకాలం కిందట గుండెపోటుతో మరణించాడు.

నగరంలో బంగారు దుకాణం నడుపుతున్న అచ్చేభా రెండో కుమారుడు ఎస్‌కే ఖాదర్‌బాషా నూరుద్దీన్‌పేటకు చెందిన నజియాను పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, ముగ్గురు మగ పిల్లలున్నారు. 

కొన్ని నెలలుగా నజియా సోదరితో ఖాదర్ ప్రేమ వ్యవహారం నడుపుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు. పద్ధతి  మార్చుకోవాలని నజియా పలుమార్లు అభ్యర్థించినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడు నెలల కిందట  మహిబాను తీసుకువెళ్లి రెండో వివాహం చేసుకున్నాడు. 

అప్పటి నుంచి ఖాదర్‌ బాషా–నజియాల మధ్య గొడవలు మరింత పెరిగాయి.  గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఖాదర్‌తో సఖ్యంగా మాట్లాడింది. అర్ధరాత్రి  పథకం ప్రకారం అప్పటికే ఇంట్లో ఉంచిన పెట్రోల్‌ తెచ్చి మంచంపై ఉన్న ఖాదర్‌పై పోసి నిప్పంటించింది. 

ఒంటిపై మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా నిద్ర లేచిన ఖాదర్‌బాషా భయంతో కేకలు పెట్టాడు. అతని అరుపులకు నిద్రలేచిన స్థానికులు మంటలను ఆర్పారు. దాదాపు 45 శాతం ఒంటిపై కాలిన గాయాలు కాగా ఎక్కువగా చాతిభాగంలో కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. 

వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతన్ని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హత్యాయత్నానికి పాల్పడిన ఖాదర్‌బాషా భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నజియాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios