విశాఖ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తీవ్రగాయాలపాలైన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వెంకోజీపాలెంలోని రామాలయం వీధిలో నివాసముంటున్న కావ్య(25) అనే యువతి మంగళవారం రాత్రి శివాజీపాలెం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా... ఆమెపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కాగా.. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

స్థానికుల సమచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాధితురాలితో మాట్లాడారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  చెప్పారు.