మంత్రి జయరాం మరోసారి చిక్కుల్లో పడ్డారు. గుమ్మనూరు పేకాట వ్యవహారంలో మంత్రి పాత్ర తేల్చటానికి సీబీఐకి అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పేకాట క్లబ్ నిర్వహణలో మంత్రి జయరాం పాత్ర ఉండటం వల్లే.. తనిఖీలకు వెళ్లిన పోలీసులపై పేకాట నిర్వాహకులు దాడి చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం దీనిని విచారణకు స్వీకరించింది.

అయితే గుమ్మనూరు పేకాట క్లబ్ విషయంలో తన ప్రమేయం లేదన్నారు మంత్రి జయరాం. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు.

పేకాట క్లబ్‌లో నా ప్రమేయం వుంటే పోలీసులు వచ్చే వారు కాదని జయరాం పేర్కొన్నారు. క్లబ్ నిందితులను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.