మాయమాటలతో మైనర్ బాలికను లోబర్చుకుని ఆమెను గర్బవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఆ విషయం శుక్రవారం వెలుగు ఈ విషయం శుక్రవారం వెలుగు చూడడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన విజయవాడ నగరం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరం కొత్తూరు తాడేపల్లి లంబాడీతండాలో నివాసం ఉంటున్న పద్నాలుగేళ్ల బాలికపై అదే వీధిలో ఉంటున్న బాణావత్ ప్రసాద్ (20) కన్నేశాడు. 

ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెతో స్నేహం చేశాడు. ఆ తరువాత మెళ్లిగా ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ బాలిక మానసిక ప్రవర్తలో తేడా కనిపించడంతో ఆమె అక్క నిలదీసింది.

దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. బాలికను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భవతి అని వారు చెప్పారు. బాలికను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.