ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఏపీ వాసి ప్రతిభ.. బ్రాంజ్ మెడల్ సాధించిన పెంటేల హరికృష్ణ
ఏపీకి చెందిన బుకారెస్ట్ గ్రాండ్ ప్రీ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో ప్రతిభ కనబర్చారు. గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించారు.
బుకారెస్ట్ గ్రాండ్ ప్రీ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఏప్రిల్ 29,30వ తేదీల్లో జరిగాయి. ఇందులో ఏపీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ప్రతిభ కనబర్చారు. రొమేనియాలో జరిగిన ఈ పోటీల్లో ఆయన బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. 10 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లతో మాగ్జిమ్ చిగేవ్ (రష్యా), డానిల్ బొగ్డాన్ (రొమేనియా) హరికృష్ణ సంయుక్తంగా టోర్నీలో ముందంజలో ఉన్నారు.
కానీ మెరుగైన టైబ్రేక్ స్కోర్‌ల ఆధారంగా ర్యాంకింగ్స్ గ్రేడ్ ను నిర్ణయిస్తారు. చిగాయేవ్‌కు మొదటి ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అలాగే బొగ్దాన్ సెకెండ్ ర్యాంక్ పొందాడు. హరికృష్ణ కు థర్డ్ ర్యాంక్ లభించింది. అయితే హరికృష్ణ మొత్తం ఎనిమిది గేమ్‌లు విజయం సాధించారు. మరో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. మన దేశానికి చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో ఓ మ్యాచ్ జరిగింది. అయితే అందులో ఆయన ఓడిపోయారు.