Asianet News TeluguAsianet News Telugu

పెమ్మసాని చంద్రశేఖర్: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Pemmasani Chandrasekhar Biography: ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి, గణనీయ విజయం సాధించారు. అయితే.. ఎన్ని కోట్లు సంపాదించినా.. తన వారి కోసం, తాను పుట్టి పెరిగిన దేశం కోసం..ఏదైనా చేయాలని కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ తరుణంలో రాజకీయాల్లో చేరి, తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది చదువుతుంటూ.. ఏదో సినిమా సోర్టీలా ఉంది కాదూ.. కానీ, ఇది రీల్ సోర్టీ కాదు.. రియల్ సోర్టీ. ఈ సోర్టీలో కథనాయకుడే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన రియల్ స్టోరీ తెలుసుకుందాం. 
 

Pemmasani Chandrasekhar Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 31, 2024, 8:41 AM IST

Pemmasani Chandrasekhar Biography: ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి, గణనీయ విజయం సాధించారు. అయితే.. ఎన్ని కోట్లు సంపాదించినా.. తన వారి కోసం, తాను పుట్టి పెరిగిన దేశం కోసం..ఏదైనా చేయాలని కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ తరుణంలో రాజకీయాల్లో చేరి, తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది చదువుతుంటూ.. ఏదో సినిమా సోర్టీలా ఉంది కాదూ.. కానీ, ఇది రీల్ సోర్టీ కాదు.. రియల్ సోర్టీ. ఈ సోర్టీలో కథనాయకుడే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నారై , వైద్య నిపుణుడు పెమ్మసాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ తెలుసుకుందాం. 
 
బాల్యం, విద్యాభ్యాసం

పెమ్మసాని చంద్రశేఖర్ ..  1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు,  ఆయనకు ఒక సోదరుడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన పుట్టింది బుర్రిపాలెంలో అయినా.. ఆయన బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991 లో తన టెన్త్ క్లాసు, 1993లో ఇంటర్ పూర్తిచేస్తారు. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ  ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు.అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇంత మంచి బ్యాంకు సాధించినందుకు ఆయనను ఎంతో మంది ప్రశంసించారు. 

అమెరికా ప్రయాణం 

మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000లో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు.  మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నో ఆన్లైన్ లో అందించేవారు. చంద్రశేఖర్ ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది. ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో  విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి  అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ పెనియర్గా అవతరించాడు. 

సేవ కార్యక్రమాలు

అలాగే.. చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు. అక్కడి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా  సేవలందించారు. ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి.. ఎన్నారైలకు ఉచితవైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు. ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు.  అలాగే.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ అని స్కూల్ ను ప్రారంభించారు. అలాగే.. పెమ్మసాని అనే ట్రస్టు ఏర్పాటు చేసి..  పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

రాజకీయ ప్రయాణం

పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే.. చాలా ఇష్టం. ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ చేరారు. ఆ తరువాత నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు. ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్ఠం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసిన ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది.చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని చంద్రబాబు టిడిపి తో కలిసి పని చేయడం ప్రారంభించారు.

చంద్రశేఖర్ .. 2014లోనే టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ, 2014, 2019లో మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంత కాలం వేచి ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ,  సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. ఏదిఏమైనా చంద్రశేఖర్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా సాగిన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios