సవాళ్లు-ప్రతిసవాళ్ళను అసెంబ్లీలోని ఏ నిబంధనల ప్రకారం పరిగణలోకి తీసుకుంటున్నారంటూ పెద్దిరెడ్డి నిలదీసారు
వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపికి కౌంటర్ ఇచ్చారు. సభలో సభ్యు లు చేసుకునే సవాళ్ళు-ప్రతి సవాళ్ళను పరిగణలోకి తీసుకునే రూల్ ఏమన్నా ఉందా? అంటూ వేసిన ప్రశ్నకు స్పీకర్ ఇబ్బంది పడ్డారు. సవాళ్లు-ప్రతిసవాళ్ళను అసెంబ్లీలోని ఏ నిబంధనల ప్రకారం పరిగణలోకి తీసుకుంటున్నారంటూ పెద్దిరెడ్డి నిలదీసారు. అటువంటి రూల్ ఏమన్నా ఉంటే తమకు చూపాలంటూ వేసిన ప్రశ్నకు అధికార పార్టీ సమాధానం చెప్పలేకపోయింది.
అటువంటి రూల్ ఏమన్నా ఉంటే, ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంపై కూడా సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసారు. ఫిరాయింపు ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించాలని తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సవాలుకు అధికార పార్టీ ఏమని సమాధానం చెబుతుందని నిలదీసారు. 21మంది ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాల విషయమై చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని గట్టిగా ప్రశ్నించారు. దాంతో ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక వెంటనే అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ చేసిన ఆరోపణలను అందుకున్నారు.
