ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో నూతన పే స్కేల్ ప్రకటించనున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అలిపిరిలో తెలిపారు. 

తిరుపతి : ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పే స్కేల్ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ ద్వారకా తిరుమల రావు Tirupati లో వెల్లడించారు. గురువారం ఆయన తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ 52వేల మంది rtc employeesను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు నూతన pay scale కూడా ప్రకటించానున్నారని తెలిపారు. 

ప్రయాణికులను సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టామని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి బస్సులను వినియోగిస్తున్నారో.. అదే తరహాలో 100 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకువస్తున్నట్లు తెలిపారు. జూలై 1న తొలి బస్సు అలిపిరి డిపోకు చేరుకుంటుందన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మిగిలిన బస్సులను కూడా తిరుపతి జిల్లాకు తీసుకొస్తామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు కోసం 30 నుంచి 50 బస్సులు.. రేణిగుంట ఎయిర్ పోర్టు, నెల్లూరు, కడప, ప్రముఖ దేవాలయాలు ఉన్న పట్టణాలకు మరో యాభై బస్సులు కేటాయించామని తెలిపారు. 

బస్సులకు ఛార్జింగ్ పాయింట్లు, విద్యుత్ చార్జీలు, కండక్టర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుందని.. డ్రైవర్లు, మాత్రం యజమానులే చూసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలిఎలక్ట్రిక్ బస్సుల బస్టాండ్ గా అలిపిరి నిలుస్తుందన్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సులను కన్వర్షన్ పద్ధతిలోఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి డిపోకు చెందిన సప్తగిరి బస్సును ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు చేయించామని పేర్కొన్నారు. తర్వాత ద్వారకా తిరుమల రావు అలిపిరి డిపోలో ఏర్పాటుచేసిన 48 ఛార్జింగ్ పాయింట్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణమోహన్, గోపీనాధ్ రెడ్డి, రవి వర్మ, పరమానందయ్య, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.