పవన్ చేసిన పోటీ పోలవరం యాత్ర

పవన్ చేసిన పోటీ పోలవరం యాత్ర

పవన కల్యాణ్ పోటీ పోలవరం యాత్ర చేశారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని వైసిపి ప్రజాప్రతినిధులు, నేతలు ముందుగానే నిర్ణయించారు. ఆ మేరకు ప్రకటన కూడా చేసారు. అయితే, హటాత్తుగా జనసేన అధ్యక్షుడు పవన్ కూడా పోలవరం యాత్రను పెట్టుకున్నారు. విజయవాడ నుండి వైసిపి బృందాలు పోలవరం బయలుదేరాయి. అయితే, ఉదయం 10 గంటల ప్రాంతానికే పవన్ కూడా పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోవటం గమనార్హం.

ఇంతకాలం పోలవరం ప్రాజెక్టు విషయమై పవన్ ఎన్నడూ మాట్లాడలేదు. పైగా ఏరోజూ ప్రాజెక్టును చూస్తానని కూడా చెప్పలేదు. అటువంటిది ప్రాజెక్టును సంరద్శించనున్నట్లు వైసిపి ప్రకటించగానే వెంటనే పవన్ కూడా పోలవరం ప్రాంతాన్ని సందర్శించటంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడు జేబులోని మనిషే పవన్ అన్న వైసిపి వ్యాఖ్యలకు పవన్ పోటీ యాత్ర ఊతమిస్తోంది.

ఇక విషయానికి వస్తే, ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న పవన్ సైట్ ఇంజనీర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు పనుల పురోగతి  గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా జరగకపోవటానికి ఎదురవుతున్న అవరోధాలేంటో వాకాబు చేశారు. నిధుల సమస్య, కాంట్రాక్టర్ సమస్యా అన్న విషయమై క్లారిటీ తీసుకున్నారు. ప్రాజెక్టు మ్యాపు, ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టు వల్లే కలిగే లాభాలు తదితరాలను అధికారులతో మాట్లాడారు. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. అదేంటంటే, పవన్ ప్రాజెక్టు వద్ద ఉన్నంత సేపు పవన్ అభిమానుల హడావుడి ఓ రేంజిలో సాగింది. ‘ఏపికి కాబోయే సిఎం పవన్’ అంటూ చేసిన నినాదాలతో ప్రాంతమంతా మారుమోగిపోయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page