కాషాయికరణపై స్పందిస్తే రోహిత్ ను అవమానించారుఅందుకే అతని ఆత్మహత్యకు పాల్పడ్డాడురోహిత్ ఘటనపై పవన్ ట్వీట్

రోహిత్ వేములకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఒక మేధావిని దేశం కోల్పోయేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు.

రోజు ఒక అంశంపై ఇక పై స్పందిస్తానని శుక్రవారం చెప్పిన పవన్ అందుకు తగ్గట్టు గా ఈ రోజు రోహిత్ ఘటనపై ట్విటర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాషాయికరణపై తొందరపాటులో ఏదో అన్నందుకే రోహిత్ ను క్యాంపస్‌ నుంచి పంపించారని అన్నారు. అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు.

బీజేపీపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన రోహిత్‌ వేములను వేధించే అధికారం ఆ పార్టీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివని వెల్లడించారు.

రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు కేంద్రం ప్రయత్నించడం దారుణమన్నారు. రోహిత్‌కు అతని సామాజిక వర్గం నుంచి కూడా సహకారం అందలేదన్నారు.

ప్రతి పార్టీ దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకుందని ఆరోపించారు.