ఏపీ ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన జనసేన అధినేత 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోయిందని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

ట్విటర్ లో పవన్ కల్యాణ్ ఆదివారం ఏపీ ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశారు.

‘‘ బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అనే పదం తప్ప వేరే ఏం లేదు. ఆంధ్రులను వెన్నెముక లేని వారిగా బీజేపీ చూస్తోంది.జైఆంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరు.

రాజధాని లేకుండా భారీ ఆదాయ లోటును రాష్ట్రానికి ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కంటి తుడుపు చర్యే’’ అని పేర్కొన్నారు.