చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం.  ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని  చూస్తున్నామని పవన్ టీడీపీని ఉద్దేశించి ట్వీట్ చేశారు,

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేధికగా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

‘‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ ’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ఓ ఇంగ్లీష్ ప్రతికలో టీడీపీ నేతలు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని ఫోటో తీసి.. దానికి పైవిధంగా క్యాప్షన్ ఇచ్చి.. పవన్ ట్వీట్ చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Scroll to load tweet…