వేలాది కుటుంబాలు కిడ్నీ బాధితులతో నానా యాతనలు పడుతున్నాయి.
మంగళవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇ,చ్ఛాపుంలో పర్యటించనున్నారు. ఉద్థానంలో పర్యటించి కిడ్నీ బాధితులను పరామర్శించాలని అనుకున్నారు. అయితే, వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. అందుకనే ఎంపిక చేసిన సుమారు 500 మంది బాధిత కుటుంబాలతో ఇచ్ఛాపురంలోనే మాట్లాడుతున్నారు.
ఇప్పటికే పవన్ విశాఖపట్నంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన తరపున ఓ డాక్యుమెంటరీని విడుదల చేసారు. ఉద్థానం కిడ్నీ సమస్య దశాబ్దాల తరబడి వేలాది కుటుంబాలను నానా యాతనలకు గురిచేస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరపున ఎందరో వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పర్యటించినా ఇక్కడ మాత్రమే కిడ్నీ సమస్యలు తలెత్తుత్తటానికి కారణాలను తెలుసుకోలేకపోతున్నారు.
