Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ ఇక సీరియస్ ఫైట్ చేస్తాడేమో

 తీరుబడిగా సినిమాలు చేసుకుంటూ, అపుడపుడు ఆవేశానికి లోనయి ఏదో ఒక బలహీన క్షణంలో  ఒక పబ్లిక్ మీటింగ్  హడావిడిగా  పెట్టి, రెచ్చిపోయి  మాట్లాడి  రాజకీయ సన్నివేశం సృష్టించి చప్పట్టు కొట్టించుకోవాలనుకోవడం ముందు ముందు కుదరకపోవచ్చు.

Pawan scared of political uncertainty

తొందర్లో  ఆంధ్రప్రదేశ్ రాజకీయా వాతావరణ బాగా వేడెక్కే సూచనలు కనిపిస్తూ ఉండటంతో  పవన్ కల్యాణ్ బిత్తరపోయినట్లుంది. ఒక వైపు నుంచి వైఎస్ఆర్ సి ఎంపిలు రాజీనామా చేసి, మరొక వైపు నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి వ్యతిరేక యాత్ర మొదలుపెడితే, సరైన అడ్రసుకూడా లేని ఆంధ్రలో పార్ట్ టైమర్ పవన్ కి జాగా దొరకడం కష్టమవుతుంది. ఇలాంటి గడ్డు రోజులేవో వస్తున్నాయని పవన్ భయపడుతున్నారా?

 

 సినిమాలు చేసుకుంటూ, అకారణంగా అపుడపుడు ఆవేశానికి లోనయి ఏదో ఒక బలహీన క్షణంలో  ఒక పబ్లిక్ మీటింగ్  హడావిడిగా  పెట్టి, రెచ్చిపోయి  మాట్లాడి  రాజకీయ సన్నివేశం సృష్టించి చప్పట్టు కొట్టించుకోవాలనుకోవడం ముందు ముందు కుదరకపోవచ్చు.

 

ఆలస్యమయిపోతే,  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అని తాను అరిచి గీ పెట్టినా వినేవాళ్లుండక పోవచ్చు. తనకు ఎదురుకాబోతున్న ఈ రాజకీయ ప్రతికూల పరిస్థితులను జనసేన నేత వూహించినట్లున్నారు. తను రాయబోతున్న పుస్తకం కంటే, నాలుగు రాళ్లు పోగుచేసుకునేందుకు చేయబోతున్న సినిమాల కంటే, రాజకీయ కార్యక్రమం ముఖ్యమని భావించినట్లున్నారు.  ఇక సినిమా ఫైట్ కాకుండా, ప్రత్యేక హోదాకోసం నిజంగాఫైట్ చేస్తానని నమ్మకం కల్గించేందుకు ఆయన చర్యలు చేపట్టినట్లున్నారు.

 

 ఇందులో భాగమే ఎలూరు ఇంటి వాడు కావాలనుకోవడం. ఆంధ్రలో  అడ్రసే లేనోడు హోదా గురించి ఏమ్మాటడతాడుని ఎవరైనా ఒక రాయి వేయక ముందే  పవర్ స్టార్ ఏలూరులో ఇల్లు వెదికే పనిలో పడ్డాడు.  పెద్ద  సంఖ్యలో వచ్చిన అభిమానుల సలహా ప్రకారం ఆయన ఏలూరులో  ఓటరుగా నమోదుచేయించుకోవాలనుకుంటున్నారని,  అక్కడే ఇల్లు కూడా వెదుక్కుంటున్నారని పార్టీ వాళ్లు చెప్పింది పాక్షిక సత్యమే. 

 

ఈ నిర్ణయం వెనక బలమయిన రాజకీయ కారణలున్నాయి. యుధ్దభూమిలోకి  ప్రవేశించక ముందే యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి ఎదురవుతూ ఉంది. నమ్ముకున్న  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసలు పవన్ అనే వాడిని లెక్క చేయకుండా ప్రత్యేక హోదా పనికే రాదు పొమ్మంటున్నారు. కనీసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని , పవన్ పొలిటికల్ సర్వైవల్ కోసం, ఈ మాట అనకుండా వుండాల్సింది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు అక్వా ఇండస్ట్రీస్ తకరారులో పవన్ రైతుల పక్షాన నిలబడ్డాడు. రైతులకు అన్యాయం చేయనీయనన్నాడు. పవన్ మాటకు విలువ ఇస్తూ,  తాత్కాలికంగా నైనా ముఖ్యమంత్రి ఆ సమస్యమీద పవన్ వాదనను మిత్రధర్మం పాటించి సమర్ధించాల్సి ఉండింది. అలాకాకుండా, తుందుర్రు రాజుగారు  ఇప్పటికే చాలా కోట్లు ఖర్చు పెట్టుకున్నారని, ఆయనింకా నష్టపోవడానికి వీల్లేదు అని చెబుతూ పొల్యూషన్ లేకుండా చూడండని అధికారులను పురమాయించి  స్టార్ పవన్ పవర్  తీసేశారు. ఇలాగే ఉంటే తెలుగుదేశం మరిన్ని దెబ్బలు తీసేసి, తనను పర్మనెంటు సినిమాలకే పరిమితం చేసే ప్రమాదం ఉంది.

 

 అందువల్ల అనంతపురంలో ప్రత్యేక హోదా మీటింగ్ పెట్టి తాను ’విప్లం సింహం’ అని తరిమెల నాగిరెడ్డి బొమ్మ పెట్టుకుని చెప్పాలనుకుంటున్నాడు.

 

పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ మరికొంత కాలం నడిపేందుకు ఇద్దరు నాయకులు అడ్డొస్తున్నారు. ఇందులో ఒక ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి కాగా, రెండో నాయకుడు ముఖ్యమంత్రి  అవినీతికి వ్యతిరేకంగా రంకెలేస్తున్న మాజీ ఎంపి ఉండవళ్లి అరుణ్ కుమార్. తొందర్లో వీళ్లిద్దరు చేరోవైపు నుంచి రాష్ట్ర మంతా కలియతిరగే అవకాశాలు కనపడుతున్నాయి. జగన్  యాత్ర కార్యక్రమ రచన పూర్తయిందని చెబుతున్నారు. తొందర్లోనే ప్రతిపక్ష నాయకుడు తన కార్యక్రమం ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇంతకంటే ముఖ్యంగా, మరీ కోపమొస్తే ఎంపిలందరి చేత జగన్రాజీనామా చేయించే అవకాశమూ లేకపోలేదు. ఈ రాజీనామా దాడి చేసే ముందు జగన్ హోదా యాత్ర చేసి వాతావరణం వేడెక్కిస్తాడని పార్టీనాయకులు చెబుతున్నారు. ఎంపిలు రాజీనామాలు చేసి పాలిటిక్స్ ను హౌజాక్ చేసుకుపోతే, పార్ట్ టైం పవన్ ని పట్టించుకునేదెవరు?

 

 మరొక వైపు  రాజమండ్రి మాజీ ఎంపి అరుణ్ కుమార్ కత్తులు దూస్తున్నాడు. ముఖ్యమంత్రి అవినీతి మీద ’నేను ఎక్కడయినా మాట్లడతాను’ అన్చెప్పి ఓటుకునోటు కేసులో ’నన్నూ బోనెక్కనీయండ’ని అడుగుతున్నారు. అనుమతిస్తే సరి, లేదంటే,  రాష్ట్రమంతా తిరిగి  కోర్టులో చెప్పాల్సిందంతా జనమ్ముందు పెడతానంటున్నాడు.  ఎపుడో రాజమండ్రికి ఎంపిగా ఉన్నాడు, ఇపుడేముంది ఆయన దగ్గిర అని అనుకుంటే పొరపాటే. అరుణ్ కుమార్ ఏ విషయాన్నయిన ఔరా అనిపించేలా చెప్పగలడు. అవతలి వాడికి చెమటలు పట్టించగలడు.

 

ఇలాంటి రాజకీయా సంక్షోభం తనకు ఎదురుకాకుండా ఉండాలంటే తను సీరియస్ గానే ఉన్నానని ప్రజలలో నమ్మకం కల్గించాల్సిన అవసరం ఉంటుందని పవర్ స్టార్ కు ఎవరో చెప్పినట్లున్నారు. అందుకే ఆయన ఎలూరు ఇంటివాడయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుంది. ఈ మహా నిర్ణయం  అందరికి కచ్చితంగా చేరాలని జనసేన పార్టీ దండోరా వేసి చెబుతున్నది.

 

Follow Us:
Download App:
  • android
  • ios