ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించిన పవన్

Pawan says people seeking explanation on pendurti incident from the government
Highlights

  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ఓ మహిళను బట్టలూడదీసిన ఘటనపై మండిపడ్డారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా ట్వట్టర్లో స్పందించటం గమనార్హం. ఘటన జరగ్గానే ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొంచి చివరకు టిడిపికి చెందిన 7 మందిని అరెస్టు కూడా చేసారు

Lack of stringent action by police & Govt on perpetrators will send wrong indications in public. In Situations like this I show restraint not to incite emotions as I had seen the repercussions of Karamchedu & chunduru incidents.

పోలీసులు. అయితే, జరిగిన ఘటన విషయంలో జనాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఇపుడు పవన్ డిమాండ్ చేసారు. నిస్సహాయురాలైన మహిళపై రాజకీయపార్టీకి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించటం పూర్తిగా అనాగరికమని మండిపడ్డారు.

తనకు తెలిసిన సమాచారం ప్రకారం, చదివిన వార్తల ప్రకారం సదరు నేతలు తెలుగుదేశంపార్టీ వారే అని కూడా పవన్ పేర్కొన్నారు. జరిగిన ఘటన విన్న, చూసిన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ట్విట్టర్లో.

Issue being extremely sensitive in nature,any kind of statement without a forethought would create deep fissures between harmonious coexistence of communities.

జరిగిన ఘటనపై ప్రభుత్వం గనుక తీవ్రంగా స్పందించకపోతే వేముల రోహిత్ ఘటనలో దేశమంతా స్పందించినట్లే అవుతుందని హెచ్చరించారు.మహిళకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.

If the Govt doesn’t respond in the manner it has to then the outcome for sure will not be pleasant one.Think of Rohit Vemula incident how it shook up the entire nation and request the authorities not to be mute spectators.

తాను గనుక ఘటన విషయంలో పరామర్శకు వెళ్ళినా లేక రోడ్డెక్కినా పరిస్ధితులు చేజారిపోయే అవకాశాలున్నాయి కాబట్టే తాను సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతుందనే తాను జనాల్లోకి రావటం లేదని కూడా స్పష్టం చేసారు.

If I come and address the issue personally,it would put a tremendous load on authorities in every way possible. Hence I plead Govt to make sure that helpless woman honour be restored and justice be done.

 

ఇటువంటి ఘటనలు వ్యక్తులు చేసినా, సమూహం చేసిన కులపరమైన వివాదాలు తలెత్తటం సహజమేనని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి అనుమానాలకు, వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ తీవ్రంగా హెచ్చరించారు.

In such incidents atrocities done by few individuals on one helpless victim or a group will get a caste colour though the rest of the community has nothing to do with it. Crimes done by individuals on others will eventually be portrayed as community clashes.

బాధితురాలికి చెందిన సామాజికవర్గం నేతలు కూడా జనాలు సంయమనం పాటించేట్లు చూడాలన్నారు.

 

 

 

 

loader