నేడే పవన్ లాంగ్ మార్చ్: పాల్గొనే నేతలు వీరే!
లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నం: జనసేనాని ఇసుక కొరతపై పోరాటంలో భగంగా, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నేడు లాంగ్ మార్చ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. విపక్షాలన్నిటికి పవన్ కలిసిరావాలని పిలుపునిచ్చినప్పటికీ, అన్ని పార్టీలు నేరుగా పాల్గొనడం లేదు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీలు నేరుగా పాల్గొననున్నాయి. బీజేపీ పాల్గొనడం వల్ల తాము పాల్గొనబోమని వామపక్షాలు తేల్చి చెప్పాయి. సైద్ధాంతికంగా తాము బీజేపీకి వ్యతిరేకమని వారు తెలిపారు. టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పాల్గొననున్నారు. జనసేన నుంచి పవన్ తో పాటు సిబిఐ మాజీ జేడీ లక్షి నారాయణ, తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, పవన్ సోదరుడు నాగబాబు పాల్గొననున్నారు.
లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్ కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ పవన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ సమస్యపై అన్ని పక్షాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు విన్నవించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"మంగళగిరి పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలతో కలసి నిరసన చేపట్టాలని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు లాంగ్ మార్చ్ కు అన్ని పక్షాలను ఆహ్వానించాం. సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు.
READ MORE ''చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''
లాంగ్ మార్చ్ కి విశాఖలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకుల అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి మీకు అండగా నిలిచాను.
ఇది 35 లక్షల మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల సమస్య. వారి సమస్య ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరే ఎక్కువ అర్ధం చేసుకోగలరు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియపర్చేందుకు ఆలంబనగా నిలవాలని కోరుతున్నాం" అని పవన్ తెలిపారు.
రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయడం, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందువల్లే జనసేన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టాల్సి వచ్చిందని...అందుకోసమే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపడుతున్నట్లు వెల్లడించారు.
READ MORE లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల
ఉపాధి కోల్పోయి, ప్రాణత్యాగాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులుకు న్యాయం చేసేందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నామని వెల్లడించారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ఏ పార్టీలో లేని విధంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీకి తరలివస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో కొన్ని మీడియా సంస్థలు జనసేనకు అనుమతులు లేవంటు ప్రచారం చేస్తున్నాయని...ఈ లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.
గత నెల 28వ తేదీనే అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. పోలీసులు ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదన్నారు. అనుకున్న సమయానికే మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుండి ఉమెన్స్ కాలేజ్ వరకు లాంగ్ మార్చ్ జరుగుతుందన్నారు. ఉమెన్స్ కాలేజ్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల వెల్లడించారు.