Asianet News TeluguAsianet News Telugu

జగన్ మీద పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రశంసల వర్షం

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాపాక హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై రాపాక ప్రసంగించారు. 

Pawan Kalyans Janasena MLA Rapaka Varaprasad Praises CM YS Jagan in Assembly - bsb
Author
Hyderabad, First Published Dec 3, 2020, 3:48 PM IST

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాపాక హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై రాపాక ప్రసంగించారు. 

ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని ప్రజా సంక్షేమ నిర్ణయాలను చిన్న వయసులోనే జగన్ అమలు చేస్తున్నాడన్నారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అన్నారు.జనం గుండెల్లో జగన్  చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. 

ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్‌ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం ప్రశంసనీయమని కొనియాడారు.

ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్‌ జగన్‌ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని రాపాక ఆకాంక్షించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్‌ ఇస్తున్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. 

రాపాక ప్రసాద్‌ ప్రసంగానికి అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ సైతం చిరునవ్వులు చిందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios