ఏలూరు: తాను సినిమాల్లోకి రాకముందే రాకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏలూరులో ప్రజా పోరాట యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాన్ తాను రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్లోకి వచ్చానని అంతా అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 

పోరాటయాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ను జూనియర్ డాక్టర్లు కలిశారు. జూడాలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి డిమాండ్లను పవన్ కళ్యాణ్ కు మెురపెట్టుకున్నారు. జూడాల సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 

మరోవైపు తాను సినిమాల్లోకి వచ్చాక రాజకీయాల్లోకి వచ్చానని అందరూ అనుకుంటారని కానీ సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యానని స్పష్టం చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. రీసెర్చ్ సెంటర్ కోసం హార్డ్వర్డ్ యూనివర్శిటీ నుంచి వైద్య బృందాన్ని తెస్తే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని పవన్ అన్నారు.

ఈ వార్తలు కూాడా చదవండి

నా ఇద్దరు పిల్లలు ఆర్దోడాక్స్ క్రిస్టియన్లే: పవన్ కళ్యాణ్