పర్యావరణాన్ని విధ్వంసం చేశారు, కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: విశాఖ ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన పవన్

విశాఖపట్టణంలోని ఎర్రమట్టి దిబ్బలను  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ పరిశీలించారు.

Pawan Kalyan Visits  erramatti Dibbalu  in Visakhapatnam lns

 విశాఖపట్టణం:టూరిజం ముసుగులో  అక్రమాలు జరిగాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.బుధవారంనాడు విశాఖపట్టణంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బలను  పవన్ కళ్యాణ్ పరిశీలించారు.ఎర్రమట్టి దిబ్బల గురించి  స్థానిక జనసేన నేత సందీప్ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.తెలంగాణలో పర్యావరణాన్ని  విధ్వంసం చేశారన్నారు.

 

ఉత్తరాంధ్రలో కూడ పర్యావరణాన్ని విధ్వసం చేస్తున్నారని ఆయన  వైసీపీపై మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులకు , గవర్నమెంట్ కు  ఏం సంబంధమని ఆయన  ప్రశ్నించారు. ప్రజల ఆస్తిని  ప్రభుత్వం జాగ్రత్తగా కాపాడాలన్నారు. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదగా ఆయన పేర్కొన్నారు. 1200 ఎకరాలుండే  ఎర్రమట్టి దిబ్బలు  292 ఎకరాలే మిగిలాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.జాతీయ సంపదైన  ఎర్రమట్టి దిబ్బలను ప్రభుత్వం రక్షించాలని ఆయన డిమాండ్  చేశారు. ఎర్రమట్టి దిబ్బల వద్ద రియల్ ఏస్టేట్  వెంచర్లు వేస్తున్నారని  ఆయన చెప్పారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విశాఖపట్టణంలో వారాహి విజయాత్ర 3 నిర్వహిస్తున్నారుఈ నెల  19వ తేదీ వరకు  పవన్ కళ్యాణ్ యాత్ర సాగుతుంది. ఇప్పటికే రెండు విడతలుగా యాత్రలు పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో  రెండు విడతల యాత్ర పూర్తైంది.   మూడో విడత యాత్రను  విశాఖపట్టణం జిల్లాలో  పవన్ కళ్యాణ్  చేపట్టారు.   వారాహి యాత్రలో  భాగంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై , వైసీపీ  సర్కార్ పై  పవన్ కళ్యాణ్  తీవ్ర విమర్శలు  చేశారు.  పవన్ కళ్యాణ్  విమర్శలకు  అదే  స్థాయిలో   వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.మూడో విడత  యాత్ర తర్వాత  ఏ జిల్లా నుండి పవన్ కళ్యాణ్ యాత్రను చేపట్టనున్నారో  త్వరలోనే  ఆ పార్టీ నేతలు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే  ఇప్పటికే  రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నేతలు  తీవ్ర స్థాయిలో  విమర్శలు చేసుకుంటున్నారు.


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios