ఇంటి నిర్మాణ పనుల్లో బిజీబిజీగా పవన్

First Published 11, Oct 2018, 3:07 PM IST
pawan kalyan visit new house, party office construction  workes
Highlights

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇంటి నిర్మాణ పనుల్లో బిజీబిజీగా గడిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వద్ద నిర్మిస్తున్న తన నివాసం, పార్టీ కార్యాలయ  నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. 

గుంటూరు: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇంటి నిర్మాణ పనుల్లో బిజీబిజీగా గడిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వద్ద నిర్మిస్తున్న తన నివాసం, పార్టీ కార్యాలయ  నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. 

స్వతగా ప్రకృతి అందాలను, పర్యావరణాన్ని ప్రేమించే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కార్యాలయంలో భారీ సంఖ్యలో మెుక్కలు నాటాలని పవన్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీల నుంచి లారీలో విలువైన మెుక్కలను తీసుకువచ్చారు. ఆ మెుక్కలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 

ఒక్కో మెుక్క యెుక్క విశిష్టత, వాటి ప్రత్యేకతలపై పవన్ కళ్యాణ్ నర్సరీ యజమానుల నుంచి తెలుసుకున్నారు. దాదాపు ఒక్కో మెుక్క వద్ద పవన్ ఐదు నిమిషాలు గడిపారు.  

పవన్ ఎంతో ఇష్టంగా నిర్మించుకోబోతున్న కొత్తింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంటి చుట్టూ 8 అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణంగా ఉండే ఈ భవనంలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచి పెట్టనున్నారు. 

మూడు అంతస్తుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు బస చేసేందుకు గదులు, శాశ్వత పని వారికి కూడా గదులు నిర్మించనున్నారు. 

అలాగే మెుదటి ఫ్లోర్‌లో చిన్న సమావేశపు మందిరంతో పాటు వంటగది, డైనింగ్ హాల్, బెడ్రూంలు నిర్మించనున్నారు. ఆ తర్వాత అంతస్తులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి మిగతా స్థలాన్ని ఖాళీగానే ఉంచాలని పవన్ భావిస్తున్నారు. 
 

loader