అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ విమర్శించారు.

స్టీల్ ప్లాంట్ పై వైసీపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే  మీ విధానం ఏమిటో పార్లమెంట్ సాక్షిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి... ఇక్కడ మాత్రం ఓట్లు కోసం నిరసన ప్రదర్శనలు చేస్తామంటే ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు.

 స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆదివారం నాడు ఆయన  ఓ వీడియో సందేశంలో మీడియాకు పంపారు.“కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కూడా తాకాయన్నారు.

  కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని ఆయన చెప్పారు. కానీ, వ్యాపారాలు చేయదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 1

970ల నుంచి లైసెన్స్ రాజ్ విధానం వల్ల.. అనుకున్న విధంగా పరిశ్రమలు నడపలేక మూతపడటం. పరిశ్రమలకు సంబంధించిన భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదే తప్ప  కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంటును మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నది కాదని ఆయన తెలిపారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు గౌరవనీయులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తో ఇదే విషయం చెప్పానని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమను చూడవద్దని చెప్పానని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా చూడాలని విన్నవించానన్నారు.

స్టీల్ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేయడం, దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులకు వెళ్లడం పోరాటయాత్ర సమయంలో చూశానని ఆయన ఆ వీడియోలో ప్రస్తావించారు.ఇలాంటి త్యాగాలతో ఈ పరిశ్రమ విశాఖలో ఏర్పడింది. ఇలాంటి పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడమని నేనే స్వయంగా అమిత్ తో చెప్పి, వినతిపత్రం ఇచ్చానన్నారు.


విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమాన్ని 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.. ఏ త్యాగాలు చేస్తే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి తెలిపాలన్నారు.

రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ చెందిన 22 మంది ఎంపీలు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంటు వేదికగా పోరాడాలని ఆయన కోరారు.ఢిల్లీలో వదిలేసి విశాఖలో నిరసనలు చేయడం చూస్తుంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని నేను నమ్ముతున్నానన్నారు.