అశోక్ గజపతి రాజుపై పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

Pawan Kalyan satires on Ashok gajapathi Raju
Highlights

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అశోక్‌గజపతిరాజుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

విజయనగరం: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అశోక్‌గజపతిరాజుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అశోక్‌గజపతిరాజుకు తానెవరో తెలియకపోవచ్చు గానీ అణగారిన ప్రజలకు తానెవరో తెలుసునని అన్నారు. 

జనసేన పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన సభలో ఆయన గురువారం ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తెరిపించలేదని విమర్శించారు. టీడీపీ, బీజేపీకి గతంలో ఓటేయమని చెప్పినందుకు ప్రస్తుతం తనను ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు.
 
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అశోక్‌గజపతిరాజు స్పందించారు. 'సినిమా నటుడు అంటున్నారని, తాను సినిమాలు చూసి చాలా కాలమైందని అశోక్‌గజపతిరాజు అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతి ఇటీవల అన్నారు. దానిపైనే పవన్ కల్యాణ్ స్పందించారు.

loader