జనసేన పార్టీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు

జనసేన పార్టీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. విజయవాడ ఆటోనగర్ నుంచి బందర్ వరకు ఆయన భారీ ర్యాలీగా చేరుకున్నారు. అయితే సభకు ఆలస్యం కావడంతో ఉయ్యూరు వరకు వారాహి వాహనంపై వచ్చిన ఆయన.. తర్వాత పోలీసుల సూచన మేరకు కారులో బందరు చేరుకున్నారు. అనంతరం సభాస్థలి వద్ద అభిమానులకు అభివాదం చేసిన పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు.