Asianet News TeluguAsianet News Telugu

ఆయనతో పవన్ భేటీ: బంపర్ ఆఫర్ ఇదే, కానీ....

ఎమ్మెల్సీ  రాము సూర్యారావు  వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా  ఏలూరు అసెంబ్లీ నుండి పోటీ చేయాలని జనసేన  ప్రతిపాదించింది. 

Pawan kalyan meets MLC RSR in west godavari district
Author
West Godavari, First Published Oct 9, 2018, 4:19 PM IST

రాజమండ్రి: ఎమ్మెల్సీ  రాము సూర్యారావు  వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా  ఏలూరు అసెంబ్లీ నుండి పోటీ చేయాలని జనసేన  ప్రతిపాదించింది. అయితే ఈ విషయమై రాము సూర్యారావు మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  రాము సూర్యారావు యూటీఎప్ మద్దతు విజయం సాధించారు.  ఈ ఎన్నికల సమయంలో ఆనాడు చైతన్య రాజును రాము సూర్యారావు ఓడించాడు.

ఉద్యోగ విరమణ తర్వాత  తన ఇంటినపే హస్టల్ గా మార్చాడు రాముసూర్యారావు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేసేవారు.  ఎమ్మెల్సీ సూర్యారావు మంచితనంతో అన్ని పార్టీలు ఆయనపై కేంద్రీకరించాయి.

పట్టణ ప్రాంత ఓట్లతో పాటు గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడ ఆర్ఎస్ఆర్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీలు భావిస్తున్నాయి.  ఈ తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఆర్ తో  సమావేశమయ్యారు. జనసేనలో చేరాలని ఆహ్వానించారు. కానీ ఈ విషయమై ఆర్ఎస్ఆర్  ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.  గతంలో  వైసీపీ, బీజేపీలుకూడ ఆర్ఎస్ఆర్‌ను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేసినట్టు ప్రచారంలో ఉంది. కానీ, ఆయన  ఆయన మాత్రం చేరలేదు.

ఏలూరు అభ్యర్థిగా ఆర్ఎస్ఆర్‌ను  బరిలోకి  దింపాలని జనసేన భావిస్తున్నట్టు సమాచారం. అయితే తనను  కొన్ని రాజకీయ పార్టీలు ఏలూరు నుండి పోటీ చేస్తే  టిక్కెట్టు ఇస్తామని  చెప్పిన మాట వాస్తమేనని ఆర్ఎస్ఆర్ చెప్పారు. కానీ, తన నిర్ణయాన్ని ఆ పార్టీలకు చెప్పలేదన్నారు. సరైన సమయంలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు.

 

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios