రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల పై సమీక్ష జరపున్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాగా.. సినిమాలో బిజీగా ఉంటూనే రాజకీయంగా స్పీడప్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన మంగళగిరిలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల పై సమీక్ష జరపున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అవ్వనున్నారు. బుధవారం తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత 32 నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యి.. పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై సూచనలు చేస్తారు.

ఏపీలో జనసేన పార్టీ పరిస్థితులపై ముఖ్య నాయకులు నివేదికల రూపంలో ఇచ్చారు. దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. రాజకీయ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. రాజధాని పై జేఏసీ నేతలకు పవన్ ఎలాంటి భరోసానిస్తారోనని ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ భవిష్యత్‌ కార్యచరణ గురించి పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి..