బెణికిన కాలు, చికిత్స: వారంటే ఇష్టమన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan injured in West Godavari tour
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో పోరాటయాత్ర వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి కాలు బెణికింది. భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్‌లో ఆయన బస చేశారు. 

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పోరాటయాత్ర వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి కాలు బెణికింది. భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్‌లో ఆయన బస చేశారు. ఆయనను కలవడానికి మంగళవారం భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు అక్కడికి వచ్చారు. 

వారితో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో కాలు జారింది. దాంతో పవన్ కల్యాణ్ కుడి కాలు బెణికింది. వెంటనే సమీప డాక్టర్లు బ్యాండేజీతో కట్టు వేశారు. కాలు నొప్పితోనే ఆయన జన సైనికుల్ని కలిసి మాట్లాడారు. 

ఆ తర్వాత వైద్యులు పరీక్షించి, కాలుకి క్యాప్ వేసి, నొప్పి నివారణకు మందులు వాడాలని, స్వల్ప విశ్రాంతి అవసరమని చెప్పారు.

ఇదిలావుంటే, తనకు వైద్యులంటే చాలా ఇష్టమని పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయన భీమవరంలో వైద్యులతో సమావేశమయ్యారు. తనకిష్టమైన వ్యక్తి చేగువేరా అని, ఆయన కూడా డాక్టరేనని పవన్ కల్యాణ్ చెప్పారు. 

loader