సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్ర మరణించడం చాలా బాధాకరమని, వారి తల్లిదండ్రుల గర్భశోకాన్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లెక్సీ కడుతుండగా ముగ్గురు జనసైనికులు మరణించిన వైషయం తెలిసిందే. ముగ్గురు జనసైనికులు మరణించడంపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్ర మరణించడం చాలా బాధాకరమని, వారి తల్లిదండ్రుల గర్భశోకాన్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు. సుమారు 25 అడుగుల ఎత్తున ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు వేడుకలకు ప్లాన్ చేశారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఇదే ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై బ్యానర్ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు.
