కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రెడ్డి అంటే ప్రజల రక్షకుడని, భక్షకుడు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు నశించాలని కోరారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జనసేన కార్యకర్తలపై జరిగిన రాళ్ల దాడిపై పవన్ ఘాటుగా స్పందించారు. 

జనసేన కార్యకర్తలపై దాడులు, కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రాయలసీమ రాగి సంగటి తిన్నవాడినని జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రజల మనిషినని పార్టీల మనిషిని కాదని పవన్‌ స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్, చంద్రబాబులా అబద్ధాల మేనిఫెస్టో ప్రకటించనని అమలు చేసే హామీలను మేనిఫెస్టోలో పొందుపరుస్తానని తెలిపారు. రైతులు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారని మండిపడ్డారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని పవన్‌ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కుటుంబ పాలనను తరిమికొడదాం, మార్పు తీసుకొద్దాం: పవన్ కళ్యాణ్

కాటంరాయుడు రాజుపై ఎదురు తిరిగినట్లు రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలి: పవన్ పిలుపు