Asianet News TeluguAsianet News Telugu

217 జీవోను ఉప సంహరించుకోవాలి: వైసీపీ సర్కార్ కి పవన్ కళ్యాణ్ డిమాండ్

మత్స్యకారుల  ఉపాధి గండికొట్టేలా  తీసకువచ్చిన  217  జీవోను  వెనక్కి  తీసుకోవాలని   జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  డిమాండ్  చేశారు.  

Pawan Kalyan Demands to YCP Government withdraw 217 G.O.
Author
First Published Nov 21, 2022, 3:03 PM IST

అమరావతి: మత్స్యకారుల  ఉపాధికి  గండికొట్టేలా తీసుకు వచ్చిన  217  జీవోను  వెనక్కి  తీసుకోవాలని  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  రాష్ట్ర  ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.  217  జీవోతో  మత్స్యకారుల  ఉపాధికి  గండిపడే  ప్రమాదం  ఉందని  పవన్ కళ్యాణ్  విమర్శించారు.  గంగపుత్రుల  అభ్యున్నతికి  జనసేన  కట్టుడి  ఉందని  పవన్ కళ్యాణ్  చెప్పారు.మత్స్యకారుల  అభ్యున్నతికి  ప్రభుత్వం  పని  చేయడం  లేదని ఆయన  విమర్శించారు.   

మత్స్యకారుల జీవన  స్థితిగతులను మెరుగుపర్చే విషయాన్ని  విస్మరించిన   పాలకులను కచ్చితంగా  ప్రజా క్షేత్రంలో  నిలదీయాలని  జనసేనాని  అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో  ప్రతి మత్స్యకార కుటుంబానికి  మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు  చెబుతున్నట్టుగా  పవన్  కళ్యాణ్  చెప్పారు. తాను చేసిన పోరాట యాత్ర సమయంలో, జనసేన  ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’లోనూ మత్స్యకారుల బాధలు వెల్లడయ్యాయని  పవన్  కళ్యాణ్  గుర్తు  చేశారు.  

సముద్రంలో వేటకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన మత్య్సకారులకు రూ.10 లక్షలు ఇస్తామనే హామీ నేటికీ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. నిబంధనల పేరుతో మత్స్యకార కుటుంబాలను ఇబ్బందిపెడుతున్నారని  చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు నిపుణులతో తమ  పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోందని  పవన్  కళ్యాణ్  చెప్పారు. మత్స్యకార  గ్రామాల్లో ఇప్పటికీ  మౌళిక  వసతులు లేవన్నారు.  ఉపాధి  కోసం  మత్స్యకారులు  పొరుగు  రాష్ట్రాలకు  వెళ్లడాన్ని అభివృద్ది  అనుకోవాలా  అని  పవన్  కళ్యాణ్  ప్రశ్నించారు. . 217  జీవో  జారీ  చేయడం  పురోగమనం  అనుకోవాలని  అని పవన్  కళ్యాణ్  అడిగారు. ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తే  కేసులు పెడుతున్నారని పవన్  కళ్యాణ్  మండిపడ్డారు. ఉత్తరాంధ్ర  జిల్లాల్లో  పర్యటించిన సమయంలో  మత్స్యకారులతో  పవన్  కళ్యాణ్  మాట్లాడారు.  మత్స్య కారుల సంక్షేమం  కోసం  తమ  పార్టీ  కట్టుబడి  ఉంటుందని  ఆయన  చెప్పారు.

జనసేనకు  10  మంది  ఎమ్మెల్యేలు  ఉండి  ఉంటే  రాష్ట్ర  ప్రభుత్వం  217  జీవోను  జారీ చేసి ఉండేదని  కాదని  పవన్  కళ్యాణ్  గతంలోనే  వ్యాఖ్యానించిన  విషయం  తెలిసిందే. ఈ  జీవోపై టీడీపీ  సహా ఇతర  విపక్షాలు  చేస్తున్న  ప్రచారంపై  వైసీపీ  నేతలు  కూడా  మండిపడుతున్నారు.   217  జీవోపై  జనసేన  పార్టీ  ఆందోళనలు  నిర్వహిస్తుంది. పశ్చిమ  గోదావరి  జిల్లాలోని నర్సాపురంలో మత్య్సకార  సభను  కూడా నిర్వహించారు. 217  జీవోపై  భయపడాల్సిన  అవసరం  లేదని వైసీపీ  నేతలు  చెబుతున్నారు. వంద  హెక్టార్ల  విస్తీర్ణం  గల  చెరువులను  బహిరంగ  వేలం  ద్వారానే  వేలం  వేస్తామని  ప్రభుత్వం  చెబుతుంది. ఈ  217  జీవోను  నిరసిస్తూ  మత్య్సకార జేఏసీ  ఆధ్వర్యంలో  ఆందోళనలు  నిర్వహించారు. ఈ  ఏడాది  మార్చి  మాసంలో   మత్య్సకార జేఏసీ  ఆధ్వర్యంలో   ఈ  ఆందోళనలు నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios