నా కర్మ: జగన్ మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై పవన్ గరం

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 14, Aug 2018, 7:36 AM IST
Pawan Kalyan counters YS Jagan on marraiges
Highlights

మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని తనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.

నిడదవోలు: మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని తనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. "జగన్‌ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. నా జీవితంలో రహస్యాలంటూ ఏమీలేవు. పవన్‌కు మూడు పెళ్లిళ్లా అని దెప్పి పొడుస్తున్నారు" అని ఆయన గుర్తు చేశారు. 

"నా కర్మ! ఒకే పెళ్ళి కుదరలేదు. నేనేం చేయను! ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు! నేను మీలాగా బలాదూర్‌ను కాదు" అని ఆయన అన్నారు. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని జగన్ కొన్నాళ్ల క్రితం జగన్ పవన్ కల్యాణ్ పై మాట్లాడిన విషయం తెలిసిందే. 

సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెంలో జనపోరాట యాత్ర సభల్లో పవన్‌ ప్రసంగించారు. ఒక పెళ్లి చేసుకుని తనపై ఆరోపణలు చేసేవారిలా బలాదూర్‌గా తిరిగే వ్యక్తిని కాదని అన్నారు. తనకు పొగరు ఎక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కర్మానుసారం జరిగిన దానికి తానేం చేయగలనని పవన్ అన్నారు. 

తన వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమైందని అన్నారు. తన పక్కన ఉండేవారికి చాలా కష్టమని, తనకు పార్టీలు, పబ్బులు పడవని అన్నారు.

loader